Share News

రోడ్డు ప్రమాద బాధితులకు పరామార్శ

ABN , Publish Date - May 04 , 2025 | 11:38 PM

శ్రీశైలం దర్శనాంతరం తిరిగి వస్తూ నంద్యాల జిల్లా బైర్లూటీ సమీపంలో ప్రమాదానికి గురై గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదితులను ఆదివారం నాయీ బ్రాహ్మణ కార్పొరేషన రాష్ట్ర చైర్మన రుద్రకోటి సదాశివం, స్టేట్‌ డైరెక్టర్‌ పరామార్శించారు.

రోడ్డు ప్రమాద బాధితులకు పరామార్శ
బాధితులను పరామర్శిస్తున్న నాయీ బ్రాహ్మణ కార్పొరేషన చైర్మన రుద్రకోటి సదాశివం

కర్నూలు హాస్పిటల్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం దర్శనాంతరం తిరిగి వస్తూ నంద్యాల జిల్లా బైర్లూటీ సమీపంలో ప్రమాదానికి గురై గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదితులను ఆదివారం నాయీ బ్రాహ్మణ కార్పొరేషన రాష్ట్ర చైర్మన రుద్రకోటి సదాశివం, స్టేట్‌ డైరెక్టర్‌ పరామార్శించారు. చైర్మన మాట్లాడుతూ చనిపోయిన బాధితులకు, గాయాలైన వారికి ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై కలెక్టర్‌ రంజిత బాషాతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూడాలని కోరినట్లు తెలిపారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.శ్రీరాములు అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. బాదితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయీ బ్రాహ్మణ స్టేట్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌, ఆదోని నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈరన్న, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కార్యదర్శి రంగస్వామి, నాయకులు మునిస్వామి, చిట్టిబాబు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2025 | 11:38 PM