రసాభాసగా కౌన్సిల్ సమావేశం
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:17 AM
నంద్యాల ము న్సిపల్ సాధారణ సమావేశం సోమ వారం రసాభాసగా మారింది.
వైసీపీ కౌన్సిలర్లు, కమిషనర్ మధ్య వాగ్వాదం
నంద్యాల టౌన సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): నంద్యాల ము న్సిపల్ సాధారణ సమావేశం సోమ వారం రసాభాసగా మారింది. స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ భవనంలో చైర్‌పర్సన మాబున్నీసా అధ్యక్షతన సమావే శాన్ని నిర్వహించారు. ముందుగా ఏజెండాను చదువుతుండగానే వైసీపీ కౌన్సిలర్లు ఇటీవల జరి గిన గేటు వేలంలో తమను అవమానించారన్నారు. దాంతో కమిషనర్‌కు, కౌన్సిలర్లుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. దాంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. టీడీపీ ప్లోర్ లీడర్ మాబువలి మాట్లాడుతూ.. ఇటువంటి సమస్యల వల్ల ప్రజా సమయంతో పాటు ప్రజాధనం వృథా కాకుండా పట్టణం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. సమావేశాన్ని సజావుగా సాగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. తాను నిబంధనల ప్రకారమే అన్ని చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం కోరం లేనందున సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్‌పర్సన ప్రక టించారు. సమావేశంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.