Marketing Department: 13 జిల్లాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:03 AM
ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు 13 జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ మార్కెటింగ్ శాఖ జాబితా విడుదల చేసింది.
గుంటూరు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు 13 జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ మార్కెటింగ్ శాఖ జాబితా విడుదల చేసింది. విజయనగరం జిల్లాలో రాజాం, పార్వతీపురం మన్యంలో సాలూరు, పాలకొండ (భామి ని), కాకినాడలో పిఠాపురం, ఏలూరులో చింతలపూడి (జంగారెడ్డిగూడెం), ఎన్‌టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు (గంపలగూడెం, ఏ కొండూరు), కంచికచర్ల, గుంటూరులో ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తాడికొండ, గుంటూరు, పల్నాడులో మాచర్ల, పిడుగురాళ్ల, గురజాల (నడికుడి), క్రోసూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట, బాపట్లలో పర్చూరు (పర్చూరు, మార్టూరు), ప్రకాశంలో మార్కాపురం, కడపలో ప్రొద్దుటూరు, అనంతపురంలో గుత్తి, తాడిపత్రి, నంద్యాలలో నంద్యాల, కర్నూలులో ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు (పెంచికలపాడు), మంత్రాలయం ఏఎంసీలలో పత్తి కొనుగోళ్లను జరపనున్నట్టు ప్రకటించింది.