గ్రామాల్లో కార్డన సెర్చ్
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:50 PM
మండలకేంద్రమైన పాములపాడులో ఎస్‌ఐ సురేశబాబు పోలీసులతో కలిసి ఆదివారం తెల్లవారుజామున కార్డనసెర్చ్ నిర్వహించారు.
పాములపాడు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రమైన పాములపాడులో ఎస్‌ఐ సురేశబాబు పోలీసులతో కలిసి ఆదివారం తెల్లవారుజామున కార్డనసెర్చ్ నిర్వహించారు. అనుమానిత ప్రాంతాలు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని పది మోటారు సైకిళ్లను, 25 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఎవరైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.
పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్ స్టేషన పరిధిలోని నెహ్రూనగర్ గ్రామంలో ఎస్‌ఐ నరేంద్ర ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పోలీ్‌సలు సోదాలు నిర్వహించారు. గ్రామంలో అనుమానితులు, బెల్ట్‌షాప్ నిర్వాహకుల ఇళ్లలో తనిఖీలు చేశారు. వాహనాలను తనిఖీ చేసి ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. దాడుల్లో జూపాడుబంగ్లా ఎస్‌ఐ మల్లికార్జున, ఏఎ్‌సఐ శేషయ్య , సిబ్బంది ఉన్నారు.