Anantapur: సీఎం, మంత్రి సంతకాలు ఫోర్జరీ
ABN , Publish Date - Apr 12 , 2025 | 06:17 AM
సహకార శాఖ అధికారుడు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, సీఎం చంద్రబాబు మరియు మంత్రి అచ్చెన్నాయుడు సంతకాలను ఫోర్జరీ చేసి, వారి పేరిట సిఫారసు లేఖలు తయారు చేశాడు. ఈ చర్యలపై అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది

వారి పేరిట సిఫారసు లేఖలు తయారు
‘అనంత’లో సహకార శాఖ అధికారిపై కేసు
అనంతపురం క్రైం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సహకార శాఖ ఉద్యో గి.. శాఖాపరమైన చర్యల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా సీఎం చంద్రబాబు, సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంతకాలనే ఫోర్జరీ చేశాడు. వారి పేరిట సిఫారసు లేఖలను తయారు చేసుకున్నాడు. చివరకు వాటిని రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపి దొరికిపోయాడు. దీనిపై అనంతపురం నాలుగో పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఈ నెల 9న కేసు నమోదైంది. సహకార శాఖ అనంతపురం జిల్లా గుత్తి సబ్ డివిజనల్ కార్యాలయంలో సీనియర్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శివాపురం సతీ్‌షకుమార్.. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన షేర్‌మార్కెట్ బిజినెస్ పనుల్లో నిమగ్నమైన ట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ధారించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ ఆదేశించారు. అయితే శాఖాపరమైన చర్యల నుంచి తప్పించుకునేందుకు సతీష్ కుమార్ సీఎం, మంత్రి పేరిట సిఫారసు లేఖలు తయారు చేసి, సహకార శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్‌కు పంపించారు.