శ్రీశైల అభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:50 PM
శ్రీశైల క్షేత్రాభివృద్ధిలో భాగమై భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు సహకరించాలని టీటీడీని శ్రీశైలం ట్రస్టుబోర్డు కోరింది.
- టీటీడీ చైర్మనకు శ్రీశైలం ట్రస్‌బోర్డు వినతి
శ్రీశైలం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రాభివృద్ధిలో భాగమై భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు సహకరించాలని టీటీడీని శ్రీశైలం ట్రస్టుబోర్డు కోరింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో టీటీడీ చైర్మన బీఆర్ నాయుడును శ్రీశైలం పాలకమండలి కమిటీ అధ్యక్షుడు పోతుగుంట రమేశనాయుడుతో పాటు సభ్యులు కలిశారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం క్షేత్రానికి రావాలని ఆహ్వానించారు. క్షేత్ర పరిధిలో యాత్రికులు బస చేసేందుకు అవసరమైన వసతులు కలిగిన గదులు, కాటేజీల నిర్మాణాలు ప్రారంభించేందుకు టీటీడీ నుంచి సహకారం కావాలని కోరారు. తిరుమల తిరుపతి తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధిపరచాలని ఆకాంక్షిస్తూ చేపడుతున్న సౌకర్యాల కల్పనలో లోటుపాట్లను సవరించాలని కోరారు. ఇందుకు స్పందించిన టీటీడీ చైర్మన బీఆర్‌నాయుడు శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి సహకరిస్తామని సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు సభ్యులు అనిల్ కుమార్, పిచ్చయ్య, రమణ, మురళీధర్, క్రాంతివర్థిని, శ్రీదేవి తదితరులు ఉన్నారు.