Share News

మేదరుల ఉపాధి కల్పనకు సహకరించండి

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:33 PM

అటవీ ఉత్పత్తు ల్లో ఒకటైన వెదురుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మేదరులు, ఎరుకలి కులాల ఉపాధి కల్పనకు అటవీశాఖ తరుపున సహకారం అందించాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కోరారు.

మేదరుల ఉపాధి కల్పనకు సహకరించండి
ఫీల్డ్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి

ఆత్మకూరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): అటవీ ఉత్పత్తు ల్లో ఒకటైన వెదురుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మేదరులు, ఎరుకలి కులాల ఉపాధి కల్పనకు అటవీశాఖ తరుపున సహకారం అందించాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కోరారు. మంగళవారం నంద్యాలలో నాగార్జునసాగర్‌ - శ్రీశైలం పెద్దపు లుల అభయారణ్యం ఫీల్డ్‌ డైరెక్టర్‌ విజయ కుమార్‌ను ఎమ్మెల్యే కలిశారు. వెదురు సమస్యపై చర్చించారు. నల్లమల అటవీ ప్రాంతంలో లభించే వెదురును సొసైటీల ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకోవా లని కోరారు. ఎమ్మెల్యే బుడ్డా వెంట కేసీ కెనాల్‌ ప్రాజెక్ట్‌ కమిటీ అధ్యక్షులు బన్నూరు రామలింగారెడ్డి తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యేను సత్కరించిన తహసీల్దారు

సైక్లోన మొంథా పైటర్‌ అవార్డు అందుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిని ఆత్మకూరు తహసీల్దార్‌ రత్నరాధిక, డీటీ ఆంజనేయులు సత్కరించారు. మంగళవారం వెలుగోడు మండలం వేల్పనూరులో ఎమ్మెల్యే స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మొంథా తుఫాన తీవ్రతను అరికట్టేందుకు ఎమ్మెల్యే బుడ్డా చేసిన కృషిని వారు కొనియాడారు.

Updated Date - Nov 04 , 2025 | 11:33 PM