Share News

పారదర్శక ఓటర్ల జాబితాకు సహకరించండి: డీఆర్వో

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:22 AM

పారదర్శక ఓటర్ల జాబితాను రూపొందించేందుకు రాజకీయపార్టీ ప్రతినిధులు సహకరించాలని డీఆర్వో రాంనాయక్‌ కోరారు.

పారదర్శక ఓటర్ల జాబితాకు సహకరించండి: డీఆర్వో
సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్వో రాంనాయక్‌

నంద్యాల రూరల్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : పారదర్శక ఓటర్ల జాబితాను రూపొందించేందుకు రాజకీయపార్టీ ప్రతినిధులు సహకరించాలని డీఆర్వో రాంనాయక్‌ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని డీఆర్వో చాంబర్‌ లో ఓటర్ల జాబితా రూపకల్పనపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు సహకరించాలన్నారు. ఓటర్ల జాబితాలో చనిపోయిన ఓటర్లు మార్పులు, చేర్పులు, బూతుస్థాయి ఏజెంట్లతో పరిశీలించుకుని అభ్యంతారాలుంటే ఈఆర్వో, ఏఆర్వోలకు తెలియజేయాలన్నారు. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు ఒక పోలింగ్‌ స్టేషనలో 1200 ఓటర్ల కంటే ఎక్కువగా ఉంటే మరొక పోలింగ్‌ స్టేషన ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి అందిన 6,7,8 పాం పెండింగ్‌ లేకుండా క్లియర్‌ చేయాలని సూచించారు. సవవేంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:22 AM