ఉద్యోగ భద్రత కావాలి: కాంట్రాక్టు పాలిటెక్నిక్ లెక్చరర్లు
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:03 AM
తమకు ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ప్రభుత్వాన్ని కోరారు.
అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): తమకు ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ప్రభుత్వాన్ని కోరారు. పాలిటెక్నిక్‌లలో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయడంతో తమ భవిష్యత్తు ఆందోళనకరం గా మారిందన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల సంఖ్యను మినహాయించి మిగిలిన పోస్టులను మాత్రమే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని కోరు తూ బుధవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో వినతిపత్రాలు ఇచ్చారు. ఏపీపీఎస్సీ చర్యలవల్ల 82 మందికి సమస్య తలెత్తుతుందని కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం నేతలు ఏఆర్ గోవర్దన్ నాయుడు, బి.కృష్ణ, పి.సాయిరాజు వివరించారు.