Continuous Rain: తిరుమలలో ఆగని వాన
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:42 AM
దిత్వా తుఫాన్ ప్రభావంతో సోమవారం సాయంత్రం వరకు తిరుమలలో వాన కురుస్తూనే ఉంది. దట్టమైన పొగమంచు క్షేత్రాన్ని కప్పేస్తోంది.
ఘాట్‌రోడ్డుపై విరిగిపడిన కొండ రాళ్లు
శ్రీవారిపాదాలు, పాపవినాశన మార్గాలు మూసివేత
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): దిత్వా తుఫాన్ ప్రభావంతో సోమవారం సాయంత్రం వరకు తిరుమలలో వాన కురుస్తూనే ఉంది. దట్టమైన పొగమంచు క్షేత్రాన్ని కప్పేస్తోంది. చలితీవ్రత పెరగడంతో రద్దీ తగ్గింది. కేవలం 19 కంపార్టుమెంట్లలోనే భక్తులు ఉన్నారు. ముందస్తు జాగ్రత్తగా తిరుమలలో సందర్శనీయ ప్రదేశాలైన పాపవినాశనం, శ్రీవారిపాదాల మార్గాలను ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. చెట్లు, కొండరాళ్లు పడుతున్న క్రమంలో భక్తులెరినీ ఆ మార్గాల్లోకి అనుమతించడంలేదు. సోమవారం తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే రెండవ ఘాట్‌రోడ్డులో తొమ్మిదవ కిలోమీటరు వద్ద కొండరాళ్లు విరిగిపడ్డాయి.