సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:51 PM
సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు.
ఫ ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి
బీసీ జనార్దనరెడ్డి
ఫ ప్రజల నుంచి వినతుల స్వీకరణ
బనగాన పల్లె, జూన 14 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు. శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాం తాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతు ల ను స్వీకరించారు. అప్పుటికప్పుడే కొన్ని సమస్యలను అధికారులకు ఫోనలు చేసి పరిష్కరించారు. కొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే అధికారులు, ఉద్యోగులు అధికంగా మంత్రిని కలుసుకొని తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఆలయాభివృద్ధికి సహకారం అందిస్తా
మండలంలోని ప్రముఖ శక్తిక్షేత్రమైన నంద వరం చౌడేశ్వరీ ఆలయాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని మంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు. నందవ రం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన.శ్రీనివాసరెడ్డి, ఆలయ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన పీవీ.కుమార్‌రెడ్డి, అర్చకులు, బది లీ అయిన ఆలయ ఈవో కామేశ్వరమ్మ శనివారం సాయం త్రం క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆలయ అభివృద్ధి, పరిశుభ్రతపై మంత్రి ఈవో శ్రీనివాసరెడ్డికి పలు సూచనలు చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్గించేలా కృషి చేయాలన్నారు.
సీఎం రిలీప్ ఫండ్ చెక్కులు పంపిణీ
పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్ కల్ప తరువు అని మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో 42మంది లబ్ధిదారులకు రూ.25లక్షల విలువైన సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. బాధితులు సీఎం చంద్రబాబుకు, మంత్రి బీసీకి ధన్యవాదాలు తెలిపారు.