Tribal Welfare Dept: గిరి ప్రగతిలో సాంకేతిక సిబ్బంది కొనసాగింపు
ABN , Publish Date - Nov 26 , 2025 | 05:57 AM
గిరి ప్రగతి మానిటరింగ్ సిస్టంలో పనిచేస్తున్న 20 మంది టెక్నికల్ సిబ్బందిని కొనసాగిస్తూ గిరిజన సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): గిరి ప్రగతి మానిటరింగ్ సిస్టంలో పనిచేస్తున్న 20 మంది టెక్నికల్ సిబ్బందిని కొనసాగిస్తూ గిరిజన సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 2018లో గిరిజన ప్రాంతాలకు డిజిటల్ డెలివరీ సేవలు అందించేందుకు ఏపీటీఎస్ ద్వారా గిరిజన సంక్షేమశాఖ ఒక బృందాన్ని నియమించింది. ఆయా పథకాలకు సంబంధించి రూపొందించిన గిరిజన ప్రగతి మాని టరింగ్ సిస్టంకు సాంకేతిక పరంగా డిజైన్, అభివృద్ధి, అ మలు, నిర్వహణ చేపట్టేందుకు 20 మందిని నియమించా రు. వారిని మార్చి-2024 దాకా కొనసాగించారు. వారిని తిరిగి కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ పలు దఫాలు విజ్ఞప్తి చేసినా ప్రభు త్వం స్పందించలేదు. అయితే, తాజాగా వారిని మరో రెండేళ్లు(వచ్చే ఏడాది మార్చి దాకా) కొనసాగిస్తూ ఆదేశాలిచ్చారు. జీతాల బకాయిలు విడుదల కానున్నాయి.