Share News

Union Minister S.P. Singh Baghel: గిరిజనుల హక్కులకు రాజ్యాంగ రక్షణ

ABN , Publish Date - Dec 25 , 2025 | 04:10 AM

గిరిజనుల హక్కులకు రాజ్యాంగ రక్షణ ఉందని కేంద్ర పంచాయతీరాజ్‌ సహా య మంత్రి ఆచార్య ఎస్‌.పి.సింగ్‌ బఘేల్‌ అన్నారు

Union Minister S.P. Singh Baghel: గిరిజనుల హక్కులకు రాజ్యాంగ రక్షణ

  • గ్రామస్థాయిలో తయారుచేసిన ప్రణాళికలో స్థానిక అవసరాలు, సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యం

  • ‘పెసా’ మహోత్సవ్‌ ముగింపు సభలోకేంద్ర పంచాయతీరాజ్‌ సహాయ మంత్రి ఎస్‌పీ సింగ్‌ బఘేల్‌

విశాఖపట్నం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల హక్కులకు రాజ్యాంగ రక్షణ ఉందని కేంద్ర పంచాయతీరాజ్‌ సహా య మంత్రి ఆచార్య ఎస్‌.పి.సింగ్‌ బఘేల్‌ అన్నారు. గిరిజనులకు రాజ్యాంగం ద్వారా లభించిన హక్కుల పరిరక్షణకు క్షేత్రస్థాయిలో కేంద్రం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ‘పెసా’ మహోత్సవ్‌ ముగింపు కార్యర కమం బుధవారం విశాఖ పోర్టు స్టేడియంలో నిర్వహించగా...కేంద్రమంత్రి వర్చువల్‌గా పాల్గొని మాట్లాడుతూ నీరు, అడవులు, భూమి, సహజ వనరులపై గిరిజనులకు ఉన్న హక్కులకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందన్నారు. గ్రామస్థాయిలో తయారుచేసిన ప్రణాళికలో స్థానిక అవసరాలు, సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వికసిత్‌ భారత్‌-2047 సాధించడానికి గిరిజన సమాజం పురోగతి చాలా కీలకమని పేర్కొన్నారు. కేంద్ర పంచాయతీరాజ్‌ కార్యదర్శి వివేక్‌ భరద్వాజ్‌ ప్రత్యక్షంగా పాల్గొని మాట్లాడుతూ స్థానిక సంస్థలకు సాధికారత కల్పించడం ద్వారా సమాజం నేతృత్వంలోని నిర్ణయాలు తీసుకునేందుకు పెసా చట్టం దీర్ఘకాలంగా పనిచేస్తోందన్నారు. పెసా గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాలు దేశంలోని ప్రజాస్వామ్య స్వరూపాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ మాట్లాడు తూ షెడ్యూల్డ్‌ ప్రాంతాల వారికి సాధికారిత కల్పించి, వారి జీవితాలను మెరుగుపర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా పెసా శిక్షణ మార్గదర్శకాలు, హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌరి జిల్లాపై ముద్రించిన పుస్తకాలను భరద్వాజ్‌, శశిభూషణ్‌కుమార్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్‌ సంయుక్త కార్యదర్శి ముక్తా శేఖర్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ, రాష్ట్ర ఐఆర్‌డీ, పీఆర్‌ కమిషనర్‌ రేవు ము త్యాలరాజు, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లు దినే్‌షకుమార్‌, హరేంధిరప్రసాద్‌, ఇతర అధికారులు మాట్లాడారు. పెసా మహోత్సవ్‌ లో భాగంగా పది రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ముగింపు కార్యక్రమంలో కబడ్డీ, విలువిద్య, 10కే రన్‌ విజేతలకు సర్టిఫికెట్లు, బహమతులు అందజేశారు.

Updated Date - Dec 25 , 2025 | 04:10 AM