Share News

Gudivada Amarnath: జగన్‌ను ఇరికించేందుకు కుట్ర

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:34 AM

లిక్కర్‌ కేసులో మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఇరికించి, అరెస్టు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ అనకాపల్లి జిల్లా...

Gudivada Amarnath: జగన్‌ను ఇరికించేందుకు కుట్ర

  • 14 నెలల్లో వైసీపీ నేతలపై 2,800 కేసులు: అమర్‌నాథ్‌

మద్దిలపాలెం (విశాఖపట్నం), జూలై 21(ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ కేసులో మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఇరికించి, అరెస్టు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. విశాఖ నగరంలోని మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో లిక్కర్‌ కేసును రోజుకో రకంగా మలుపు తిప్పుతున్నారు. లిక్కర్‌ స్కామ్‌లో రాజశేఖరరెడ్డి ప్రధాన నిందితుడని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎంపీ మిథున్‌రెడ్డి సూత్రధారి అంటూ అరెస్టు చేశారు. ఏదోవిధంగా జగన్‌ను అరెస్టు చేయడానికి చూస్తున్నారు. ముందు రూ.లక్ష కోట్లు స్కామ్‌ అంటూ ప్రచారం చేసి ఇప్పుడు రూ.3,500 కోట్లకు వచ్చారు. 14 నెలల కాలంలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం సుమారు 2,800 కేసులు బనాయించింది’ అని అమర్‌నాథ్‌ విమర్శించారు.

Updated Date - Jul 22 , 2025 | 04:34 AM