Share News

Nara Bhuvaneshwari: ఆత్మవిశ్వాసంతో అడుగేస్తే విజయం తథ్యం

ABN , Publish Date - Nov 22 , 2025 | 05:44 AM

ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తే విజయం మహిళలదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు.

Nara Bhuvaneshwari: ఆత్మవిశ్వాసంతో అడుగేస్తే విజయం తథ్యం

  • మహిళలతో ముఖాముఖిలో నారా భువనేశ్వరి

  • కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు పర్యటన

కుప్పం/రామకుప్పం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తే విజయం మహిళలదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మూడో రోజైన శుక్రవారం ఆమె శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. శాంతిపురం మండలం నడింపల్లె, రామకుప్పం మండలం ఆనిగానూరు గ్రామాల్లో మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. శాంతిపురం మండలంలో తుమ్మిశి పెద్ద చెరువు, రామకుప్పం మండలంలో విజలాపురం చెరువు వద్ద కృష్ణా జలాలకు భువనేశ్వరి హారతి ఇచ్చారు. అంతకుముందు శాంతిపురం మండలం కడపల్లె నుంచి తుమ్మిశి పెద్ద చెరువు వరకు మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా పొందుతున్న లబ్ధి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. శాంతిపురం నుంచి కనమనపల్లె దాకా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు ద్వారా కూడా మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే ఎన్నో రకాల వృత్తులు, పనుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌలభ్యాన్ని దుర్వినియోగం చేసుకోకుండా... ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఎదగడానికి వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని దుర్మార్గపు పాలన నుంచి విముక్తి చేసి ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఎన్నో త్యాగాలు చేశారని భువనేశ్వరి పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరికాయని, యువత భవిష్యత్తు ఈ మత్తులో ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు.


మాటిచ్చారు... వచ్చారు!

మహిళా కార్యకర్త ఇంటికి భువనేశ్వరి

నాలుగురోజుల కుప్పం పర్యటనలో భాగంగా సీఎం సతీమణి భువనేశ్వరి నియోజకవర్గం ప్రజలతో మమేకమవుతున్నారు. ఆమె మొదటిరోజు పర్యటనలో రామకుప్పం మండలం చెల్దిగానిపల్లె వద్ద ఓ బీసీ మహిళ చేసిన అభ్యర్థనను మన్నించి, వాళ్ల ఇంటికి వస్తానని వాగ్దానం చేశారు. శుక్రవారం రాత్రి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. చెల్దిగానిపల్లెలోని పార్టీ కార్యకర్త లక్ష్మమ్మ ఇంటికెళ్లి వారిని సం భ్రమాశ్చర్యంలో ముంచెత్తారు. భువనేశ్వరిని సాదరంగా స్వాగతించి, చీర సారెలను బహుకరించారు. ఈ సందర్భంగా లక్ష్మమ్మ కుటుంబసభ్యుల యోగక్షేమాలను భువనేశ్వరి విచారించారు. అల్పాహారం తీసుకుని తిరిగి వచ్చారు.

Untitled-10 copy.jpg

Updated Date - Nov 22 , 2025 | 05:45 AM