Share News

Kambhampati Rammohan Rao Mother Passed away: కంభంపాటి రామ్మోహనరావుకు మాతృ వియోగం

ABN , Publish Date - Dec 18 , 2025 | 03:53 AM

టీడీపీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన.రావు తల్లి వెంకట నరసమ్మ (99) కన్నుమూశారు.

Kambhampati Rammohan Rao Mother Passed away: కంభంపాటి రామ్మోహనరావుకు మాతృ వియోగం

ఉంగుటూరు, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన.రావు తల్లి వెంకట నరసమ్మ (99) కన్నుమూశారు. కృష్ణాజిల్లా పెదఅవుటపల్లిలోని స్వగృహంలో నివాసముంటున్న వెంకటనరసమ్మ మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. పిన్నమనేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. వెంకటనరసమ్మకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. కుమార్తె గృహిణి కాగా, పెద్దకుమారుడు కంభంపాటి వెంకటేశ్వరరావు రైతుగా గన్నవరంలో స్థిరపడ్డారు. రెండో కుమారుడు కంభంపాటి రామ్మోహనరావు రాజకీయ నాయకులుగా, పారిశ్రామికవేత్తగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

Updated Date - Dec 18 , 2025 | 03:53 AM