స్థలాలకు పరిహారం ఇవ్వాలి
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:53 PM
నేషనల్ హైవే 340సీలో స్థలాలు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
పాములపాడు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): నేషనల్ హైవే 340సీలో స్థలాలు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని రుద్రవరం గ్రామంలో హైవే అధికారులు, తహసీల్దార్ సుభద్రమ్మ, సీఐ సురేశకుమార్‌రెడ్డి, ఎస్‌ఐల ఆధ్వర్యంలో ప్రొక్లైయినతో సర్వీ్‌సరోడ్డు నిర్మాణానికి అడ్డంకులను తొలగించేందుకు శ్రీకారం చుట్టారు. దాంతో యంత్రాలను గ్రామస్థులు అడ్డుకున్నారు. వారు మాట్లాడుతూ నేషనల్ హైవే స్థలాలు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వకుండా గృహాలను తొలగించడం సరికాదన్నారు. ఫైఓవర్‌కు ఇరు వైపులా సమానంగా కొలతలు వేసి సర్వీ్‌సరోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. కానీ, హైవే అధికారులు ఒకవైపు ఎక్కువభాగం, మరోవైపు తక్కువస్థలం తీసుకోవడం సరికాదన్నారు. అధికారులు సమానంగా కొలతు వేసి న్యాయం చేయాలని అధికారులను కోరారు. దాంతో అధికారులు మాట్లాడుతూ మూడు రోజుల సమయం ఇస్తున్నామని, పరిహారం తీసుకున్నవారు కట్టడాలను తొలగించుకోవాలని, లేదంటే తామే కూల్చేస్తామని హెచ్చరించారు.