Kakinada: పాకిస్థాన్ జెండాలతో హల్‌చల్
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:40 AM
కాకినాడ జిల్లా కేంద్రంలో పాకిస్థాన్ జెండాలు ప్రదర్శిస్తూ కార్లతో హల్‌చల్ చేసిన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాకినాడలో నలుగురు అదుపులోకి, 4కార్లు స్వాధీనం
కాకినాడ క్రైం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కేంద్రంలో పాకిస్థాన్ జెండాలు ప్రదర్శిస్తూ కార్లతో హల్‌చల్ చేసిన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4కార్లను సీజ్ చేశారు. శనివారం సీఐ ఎం.నాగదుర్గారావు వివరాలను వెల్లడించారు. ఈనెల 5న మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథపురం మసీదు వద్ద నిర్వహించిన ర్యాలీలో కొందరు పాక్, పాలస్తీనా జెండాలతో కవ్వించారు. దీనిపై స్థానికుల ఫిర్యాదు మేరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.