కామన్‌సైట్ అక్రమ రిజిస్ర్టేషన్
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:44 AM
గండిగుంట పంచాయతీ పరిధి కాటూరు రోడ్డులో ఓ అనధికార లే అవుట్‌లో కోట్లాది రూపాయల విలువ చేసే సుమారు 33 సెంట్ల కామన్ సైట్‌ను లే అవుట్ వేసిన వారు ఇటీవల ఓ వ్యక్తికి ఈ నెల 6న అక్రమంగా రిజిసే్ట్రషన్ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
-గండిగుంటలో రూ.కోట్ల విలువైన 33 సెంట్లు విక్రయించిన లే అవుట్ నిర్వాహకులు
-2008లో పంచాయతీకి ఇస్తున్నట్టు దాన పత్రం ఇచ్చినా రిజిసే్ట్రషన్ చేయించుకోని పంచాయతీ అధికారులు
- ఆలస్యంగా వెలుగుచూసిన వ్యవహారం
- తప్పుసరిదిద్దుకునే పనిలో పంచాయతీ అధికారులు
ఉయ్యూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) :
గండిగుంట పంచాయతీ పరిధి కాటూరు రోడ్డులో ఓ అనధికార లే అవుట్‌లో కోట్లాది రూపాయల విలువ చేసే సుమారు 33 సెంట్ల కామన్ సైట్‌ను లే అవుట్ వేసిన వారు ఇటీవల ఓ వ్యక్తికి ఈ నెల 6న అక్రమంగా రిజిసే్ట్రషన్ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... గండిగుంటకు చెందిన ఆలూరు లత, వల్లభనేని రామారావుకు చెందిన 258/2, 259/1 సర్వే నంబర్లలోని 3.29 ఎకరాల వ్యవసాయ భూమిలో 2008లో లే అవుట్ వేశారు. 35 ప్లాట్లుగా విభజించి, అందులో 33 సెంట్ల భూమిని కామన్ సైట్‌గా చూపించి అన్ని ప్లాట్లు విక్రయించారు. కామన్ సైట్‌గా వదిలిన భూమిని గ్రామ పంచాయతీకి ఇస్తున ్నట్టు లేఅవుట్ వేసిన వారు దాన పత్రం రాసి ఇచ్చారు. అయితే అప్పటి నుంచి పంచాయతీ వారు దానిని రిజిస్ర్టేషన్ చేయించుకోకపోవడంతో లే అవుట్ నిర్వాహకులు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని రత్నా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ మేనేజింగ్ పార్టనర్ బోరుకాటి ప్రసాదరాజకు విక్రయుంచి, సీఎస్ నంబరు 5146, 5051/2025తో ఉయ్యూరు సబ్‌రిజిసా్ట్రర్ కార్యాలయంలో రిజిస్ర్టేషన్ చేశారు. విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ అధికారులు హడావిడిగా తప్పుసరిదిద్దుకునేందుకు అక్రమ రిజిసే్ట్రషన్ రద్దు చేసి ఇరువర్గాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తున్నారు. కాగా, అనధికార లేఅవుట్లలో రిజిసే్ట్రషన్లు చేయరాదన్న ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ రిజిసే్ట్రషన్ చేయడంపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా సబ్‌రిజిసా్ట్రర్ సెలవులో ఉన్నట్టు కార్యాలయ ఉద్యోగులు తెలిపారు. గండిగుంటలో పంచాయతీకి చెందిన కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అన్యాక్రాంతం అవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారులకు నివేదించాం
గ్రామ పంచాయతీకి చెందిన సుమారు 33 సెంట్ల కామన్ సైట్ అక్రమ రిజిషే్ట్రషన్ రదు ్దచేసి, ఇరువర్గాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిసా్ట్రర్, ఏపీసీఆర్డీఏ, ఆర్డీవోకు నివేదిక అందచేశాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
కుమార్, గండిగుంట గ్రామపంచాయతీ సెక్రటరీ