మున్సిపల్ సిబ్బంది పనితీరుపై కమిషనర్ ఆరా
ABN , Publish Date - May 15 , 2025 | 11:55 PM
రాజంపేట పట్టణంలో మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై కమిషనర్ ఆరా తీస్తున్నారు.
రాజంపేట టౌన, మే 15 (ఆంధ్రజ్యోతి) : రాజంపేట పట్టణంలో మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై కమిషనర్ ఆరా తీస్తున్నారు. గురువారం పట్టణంలో డోర్ టు డోర్ చెత్తసేకరణకు సంబంధించి ప్రజలతో మాట్లాడారు. తడిచెత్త, పొడిచెత్త వేర్వేరుగా అందిస్తున్నారా.. మీకు మున్సిపల్ సిబ్బంది సహకరి స్తున్నారా... అని అడిగి తెలుసుకు న్నా రు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు.