పార్కుల ఏర్పాటుపై దృష్టిసారించిన కమిషనర్
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:29 PM
మున్సిపల్ సుందరీకరణలో భాగంగా పా ర్కులపై మున్సిపల్ కమిషనర్ నరసింహా రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు.

బద్వేలుటౌన, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్ సుందరీకరణలో భాగంగా పా ర్కులపై మున్సిపల్ కమిషనర్ నరసింహా రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. ఆదివారం కమిషనర్ తన సిబ్బందితో కలసి ఎన్జీఓ కాలనీలో మున్సిపల్ కార్యాలయం ఎదురు గా ఉన్న 96సెంట్ల ప్రభుత్వ స్థలంలో పా ర్కు నిర్మాణం కోసం కొలతలు వేసి ప్రణా ళికను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ త్వరలోనే బద్వేలు మున్సిపాలిటీ ఆహ్లాదకర మున్సిపాలిటీగా తీర్చి దిద్దడానికి ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అర్బ న గ్రీనింగ్ కార్పొరేషన వారికి మున్సిపాలిటీలోని ఎన్జీఓ కాలనీలో పార్కుకు, మైదు కూరురోడ్డు నందిపల్లె సమీపంలో ఉన్న సగిలేరు బ్రిడ్జి వద్ద రెండు వైపుల బ్యూటి ఫికేషన, కోటవీధిలోని పాత ప్రభుత్వాసుపత్రిలో ఒకటిన్నర్ర ఎకరాలో పార్కు, వాకింగ్ ట్రాక్, చెన్నంపల్లె వద్ద ఆలయం వెనుకవైపు 1.50 ఎకరాల్లో పార్కు, వాకింగ్ ట్రాక్, నాగులచెరువు వద్ద బ్యూటిఫికేషన వాకింగ్‌ట్రాక్, రూపరాంపేట శివాలయం వద్ద ఉన్న కుంటవద్ద బ్యూటిఫికేషన ఇలా 6చోట్ల పార్కుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపిం చడం జరిగిందన్నారు. పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడాలని ఆయన పట్టణ ప్రజలను కోరారు.