AP College Association: 21న కాలేజీలు బంద్
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:08 AM
డ్యూయల్ మేజర్ డిగ్రీ అమలు చేయాలనే డిమాండ్‌తో పా టు పలు సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 21న కాలేజీలు మూసివేయాలని...
అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): డ్యూయల్ మేజర్ డిగ్రీ అమలు చేయాలనే డిమాండ్‌తో పా టు పలు సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 21న కాలేజీలు మూసివేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జే.రమణాజీ, జి.రాజ్‌కుమా343ర్ చౌదరి, ప్రతినిధులు పి.రాజశేఖర్, సి.విజయ్‌భాస్కర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని ఈ ఏడాది ఫిబ్రవరిలో హామీ ఇచ్చారని, కానీ ఆ తర్వాత వాటిని పట్టించుకోలేదని తెలిపారు. డిగ్రీపై ప్రొఫెసర్ వెంకయ్య కమిటీ సిఫారసులను అమలుచేసి డ్యూయ ల్ మేజర్ విధానం ప్రవేశపెట్టాలన్నారు. ఇప్పటికే డ్యూయల్ మేజర్ విధానానికి నోటిఫికేషన్ విడుదల చే యగా, అందుకు అనుగుణంగా వి ద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించామని తెలిపారు. ఇప్పు డు మళ్లీ సింగిల్ మేజర్ విధానం తేవాలనే నిర్ణయంతో పరిస్థితి గందరగోళంగా మారిందన్నారు. అలాగే వెంటనే డిగ్రీ అడ్మిషన్లకు షెడ్యూలు ప్రకటించాలని, ఫీజుల బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.