Minister Anagani Satya Prasad: ఇది 4.5 వెర్షన్
ABN , Publish Date - Dec 18 , 2025 | 05:38 AM
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఇప్పటికి జిల్లా కలెక్టర్ల సదస్సులు నాలుగుసార్లు జరిగాయి.
కలెక్టర్ల సదస్సుకు ‘కొత్త సిరీస్’
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఇప్పటికి జిల్లా కలెక్టర్ల సదస్సులు నాలుగుసార్లు జరిగాయి. వాటికి... 1, 2, 3, 4 అని పేరు పెట్టారు. బుధవారం మొదలైన కలెక్టర్ల సదస్సు ఐదవది. కానీ... దీనికి ‘4.5’గా నామకరణం చేశారు. ఏమిటీ కొత్తదనమని ఆరా తీయగా... రెవెన్యూ శాఖ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఇది నాలుగోసారి. ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న 5వ కలెక్టర్ల సదస్సు ఇది. ఆ నాలుగు, ఈ ఐదును కలిపి... సింబాలిక్‌గా ‘4.5’ వెర్షన్ ఖరారు చేశామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. తదుపరి సదస్సును ‘4.6’గా పిలుస్తామన్నారు.