World Adivasi Day: డప్పు కొట్టి.. థింసా నృత్యం
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:38 AM
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం పార్వతీపురంలోని ఐటీడీఏ కార్యాలయంలో అడవితల్లి విగ్రహానికి ప్రథమ పూజలు చేశారు.
అడవి తల్లికి మన్యం కలెక్టర్ పూజలు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం పార్వతీపురంలోని ఐటీడీఏ కార్యాలయంలో అడవితల్లి విగ్రహానికి ప్రథమ పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్ శ్రీవాత్సవ సంప్రదాయబద్ధంగా అడవితల్లికి నూతన వస్ర్తాలు, సారెను సమర్పించారు. అనంతరం విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గిరిజనులతో కలిసి డప్పు కొట్టి థింసా నృత్యం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు, గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కలెక్టర్ తెలిపారు. డోలీ మోతలు తప్పించేందుకు పక్కా రహదారుల నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
- పార్వతీపురం. ఆంధ్రజ్యోతి