Cold Wave: దక్షిణ భారతంపైకి చలిగాలులు
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:39 AM
వాయవ్య, మధ్య భారతంలో అధికపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సైబీరియా నుంచి వచ్చే శీతల గాలులు మధ్య భారతం, దానికి ఆనుకుని ఉన్న...
అరకు లోయలో 4.4 డిగ్రీల ఉష్ణోగ్రత
విశాఖపట్నం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): వాయవ్య, మధ్య భారతంలో అధికపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సైబీరియా నుంచి వచ్చే శీతల గాలులు మధ్య భారతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ భారతంపైకి వీస్తున్నాయి. చాలాకాలం తర్వాత చలిగాలులు తెలంగాణ, కోస్తా, రాయలసీమ, ఉత్తర కర్ణాటక మీదుగా తమిళనాడులోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. దీనికితోడు అనేక ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. పది రోజుల నుంచి చలి గాలుల జోరు తగ్గలేదు. ఉత్తరకోస్తాలో ఏజెన్సీ ప్రాంతాలతోపాటు రాయలసీమలో అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఆదివారం అరకులోయలో 4.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మైదాన ప్రాంతంలోని శ్రీసత్యసాయి జిల్లా ఆర్.అనంతపురంలో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.