AP Weather: జి.మాడుగులలో 3.8 డిగ్రీలు
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:55 AM
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి మంచు దట్టంగా కురుస్తోంది.
ఏజెన్సీలో కొనసాగనున్న చలి
మైదానంలో స్వల్పంగా తగ్గే అవకాశం
విశాఖపట్నం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి మంచు దట్టంగా కురుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో విజిబులిటీ వంద మీటర్ల కంటే తక్కువగా నమోదవుతోంది. దీంతో ఉదయం పూట వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 3.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు, మూడు రోజుల్లో మైదాన ప్రాంతాల్లో చలి స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని, ఏజెన్సీలో మాత్రం అదేవిధంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.