శ్రీశైలంలో చలి పంజా
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:07 AM
నల్లమలలోని శ్రీశైల క్షేత్రం పరిసర ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ చలి తీవ్రత పెరిగిపోతోంది.
పది రోజులుగా పది డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
మంచుపొగతో కనిపించని క్షేత్ర వీధులు
వణికిపోత్ను పిల్లలు, వృద్ధులు
శ్రీశైలం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : నల్లమలలోని శ్రీశైల క్షేత్రం పరిసర ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ చలి తీవ్రత పెరిగిపోతోంది. పదిరోజులుగా పది డిగ్రీల అత్యల్ప స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెల్లవారుజామున పొగమంచుతో క్షేత్ర వీధులు కనిపించడం లేదు. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. శీతాకాలం ప్రారంభమైన నవంబరు తొలి వారం నుంచే చలి తీవ్రతతో పిల్లలు, వృద్ధులు వణికిపోతున్నారు. చలిగాలుల వల్ల వచ్చే వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.