Share News

కొండెక్కిన కొబ్బరి బోండం

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:08 PM

కొబ్బరి బోండం ధరలు కొండెక్కాయి. ఒక్కో కొబ్బరి బొండం ధర సైజును బట్టి రూ.50 నుంచి రూ.70కి పైగా పలుకుతుండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది.

   కొండెక్కిన కొబ్బరి బోండం
మార్కెట్లో అమ్ముడవుతున్న కొబ్బరి బోండాలు

ధర రూ.50 నుంచి రూ.70 వరకు పలుకుతున్న వైనం

పెరిగిన కొబ్బరి నూనె రేటు

కొలిమిగుండ్ల, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): కొబ్బరి బోండం ధరలు కొండెక్కాయి. ఒక్కో కొబ్బరి బొండం ధర సైజును బట్టి రూ.50 నుంచి రూ.70కి పైగా పలుకుతుండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది. గతంలో రూ.25, 30 ఉన్న కొబ్బరి బోండం ధరలు గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం రూ.70కి చేరుకొని సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. సహజంగా అనారోగ్యానికి గురైన వారు కొబ్బరి బోండం తాగడానికి ఇష్టపడటంతో పాటు, వైద్యులు కూడా కొబ్బరి బోండం నీరు తాగాలని సూచిస్తున్నారు. ఇటీవల జోరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో రోగాలబారిన పడుతున్న సామాన్యులు కొబ్బరి బొడం కొనాలంటే భయపడిపోయో పరిస్థితి నెలకొంది. కొబ్బరి బోండం ధరలు పెరగడానికి ఆంధ్రప్రదేశతో పాటు, కర్ణాటక, తమిళనాడు రాషా్ట్రల్లో దిగుబడి తగ్గడమే ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. అనేక ప్రాంతాల్లో 30నుండి 40 శాతం వరకు దిగుబడి పడిపోవడంతో, డిమాండ్‌ తగ్గ ఉత్పత్తిలేక ధరలు అమాంతం పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

అదే దారిలోనే కొబ్బరి నూనె రేటు

అన్నివర్గాల ప్రజలు అత్యధికంగా వినియోగించే కొబ్బరి నూనె ధరలు అదే పంతాలో నడుస్తున్నారు. గడిచిన కొద్ది నెలల వ్యవధిలోనే 30 శాతానికి పైగా కొబ్బరి నూనె ధరలు పెరిగినట్లు వినియోగదారులు వాపోతున్నారు. గతంలో 500 ఎంఎల్‌ కొబ్బెరి నూనె బాటిల్‌ ధర రూ.230 ఉండగా, ప్రస్తుతం రూ.300కు చేరింది. వివిధ కంపనీలను బట్టి ధరల్లో కొంతమేర వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధరల నియంత్రణపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 22 , 2025 | 11:08 PM