Weather alert: కోస్తాలో బలమైన గాలులు
ABN , Publish Date - Jul 08 , 2025 | 05:01 AM
భూ ఉపరితలం నుంచి 12 కిలోమీటర్ల ఎత్తులో ఈస్టర్లీ జెట్ (వియత్నాం నుంచి దక్షిణ భారతం మీదుగా ఆఫ్రికా వరకు) గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు సూచన
విశాఖపట్నం, జూలై 7(ఆంధ్రజ్యోతి): భూ ఉపరితలం నుంచి 12 కిలోమీటర్ల ఎత్తులో ఈస్టర్లీ జెట్ (వియత్నాం నుంచి దక్షిణ భారతం మీదుగా ఆఫ్రికా వరకు) గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మధ్య కోస్తా, దానికి ఆనుకుని ఉత్తర కోస్తాలో సోమవారం బలమైన తూర్పుగాలులు వీచాయి. దీం తో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరించిం ది. ఈస్టర్లీ జెట్ ప్రయాణించే ప్రాంతానికి ఎగువన అంటే ఛత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణ, మధ్య మహారాష్ట్రల్లో రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఛత్తీస్‌గఢ్‌లో కుంభవృష్టిగా వర్షాలు కురవ డంతో గోదావరికి వరద మొదలైందని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో ఈస్టర్లీ జెట్ ప్రభావంతో బలమైన గాలులు తప్ప వర్షాలు లేవన్నారు. రానున్న 2, 3 రోజుల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయన్నారు.