CREDAI AP Representatives: కూటమి నిర్ణయాలతో రియల్ ఊపు
ABN , Publish Date - Dec 12 , 2025 | 05:44 AM
కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కీలకమైన నిర్ణయాలతో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు అభివృద్ధి పథంలో...
సీఎం చంద్రబాబును కలసిన క్రెడాయ్ ప్రతినిధులు
అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కీలకమైన నిర్ణయాలతో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నాయని క్రెడాయ్ ఏపీ ప్రతినిధులు తెలిపారు. క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు బాయన శ్రీనివాసరావు, చైౖర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, కార్యదర్శి దాసరి రాంబాబు, పదాధికారులు, జాతీయ డెలిగేషన్ సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం గురువారం సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసింది. నిర్మాణ పనుల్లో నాణ్యత, ఉత్పాదకతను పెంచేందుకు అమరావతిలో స్కిల్ డెవల్‌పమెంట్ కార్యక్రమాలు నిర్వహించేందుకు క్రెడాయ్ ఏపీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు.