Share News

సీఎం పర్యటన విజయవంతం

ABN , Publish Date - May 18 , 2025 | 10:58 PM

సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనను విజయవంతమైందని, ఇందుకు కూటమి నాయకులు, కార్యకర్తలకు పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత ధన్యవాదాలు తెలిపారు.

సీఎం పర్యటన విజయవంతం

కూటమి శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, మే 18(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనను విజయవంతమైందని, ఇందుకు కూటమి నాయకులు, కార్యకర్తలకు పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత ధన్యవాదాలు తెలిపారు. పాణ్యం నియోజకవర్గం అభివృద్ధికి సీఎం చంద్రబాబు వరాలు ప్రకటించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. కల్లూరు అర్బన 16 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పార్క్‌లు వంటి మౌలిక వసతుల కల్పనకు సీఎం ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారన్నారు. అందులో భాగంగానే రూ.50 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపారని ఎమ్మెల్యే చెప్పారు. తక్షణమే కర్నూలు అర్బన డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) నుంచి రూ.5 కోట్లు, మున్సిపల్‌ కార్పొరేషన నుంచి రూ.3 కోట్లు మొత్తం 8కోట్ల నిధుల విడుదలకు మున్సిపల్‌శాఖ మంత్రి గ్రీనసిగ్నల్‌ ఇచ్చారని గౌరు చరిత వివరించారు. నియోజకవర్గం పరిధిలోని శివారుల ప్రాంతాలు, కాలనీల్లో త్వరలో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కల్లూరు అర్బన 16 వార్డుల తాగునీటి సరఫరా కోసం గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి ప్రత్యేక పైపులైన ఏర్పాటు ప్రక్రియను ప్రాధాన్యతా అంశంగా పరిగణించి ప్రజలకు తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా సఫా కాలేజీ నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు రహదారి పనులు మంజూరైన గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. అనుమతి రాగానే పనులు పూర్తికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - May 18 , 2025 | 10:58 PM