Share News

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:15 AM

సీఎం సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌)పేదలకు వరమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం: ఎమ్మెల్యే
బాధిత కుటుంబాలకు చెక్కులను అందిస్తున్న ఎమ్మెల్యే అఖిలప్రియ

ఆళ్లగడ్డ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): సీఎం సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌)పేదలకు వరమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అన్నారు. సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను శుక్రవారం శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని 40 మంది కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ. 33.33లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని ఆయా కుటుంబ సభ్యులకు అందజేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు బాధిత కటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - Sep 13 , 2025 | 12:15 AM