Share News

పేదలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:02 AM

పేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వరమని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనఎండీ ఫిరోజ్‌ అన్నారు.

పేదలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌
బాధితుడికి చెక్కును అందజేస్తున్న ఫిరోజ్‌

టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎనఎండీ ఫిరోజ్‌

బాధితులకు చెక్కులు అందజేత

నంద్యాల రూరల్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : పేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వరమని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనఎండీ ఫిరోజ్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన రూ.33.51,863ల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను 43మంది బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫిరోజ్‌ మాట్లాడుతూ.. మంత్రి ఫరూక్‌కు సమస్యను విన్నవించుకున్న సందర్భంలో బాధితుల ఆవేదన విని, అప్పటికప్పుడు దగ్గరుండి సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేయించారన్నారు. పేదలను ఆపదలో నేనున్నానని ఆదుకోవ డం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మంచి మనసుకు నిదర్శమన్నారు. కార్యక్రమంలలో మైనారిటీ ఫైనాన్స కార్పొరేషన డైరెక్టర్‌ ఖలీల్‌, గోస్పాడు మండల కన్వీనర్‌ తులసీశ్వర్‌రెడ్డి, నంద్యాల మండల కన్వీనర్‌ విశ్వనాథరెడ్డి, కౌన్సిలర్‌ శ్యాం సుందర్‌ దితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 12:02 AM