Employee Issues: దశలవారీగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:18 AM
ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో సీఎం నిర్వహించిన ఈ సమావేశాన్ని స్వాగతిస్తున్నాం. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది....
‘ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో సీఎం నిర్వహించిన ఈ సమావేశాన్ని స్వాగతిస్తున్నాం. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీపావళికి ముందు ఉద్యోగులు, పోలీసులకు సీఎం తీపి కబురు చెప్పి, ఆ కుటుంబాల్లో దీపావళి వెలుగులు నింపారు. పీఆర్సీ కమిటీ చైౖర్మన్ ఎంపికను తనకు వదిలేయాలని సీఎం చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని ఆదేశించారు. త్వరలోనే మరోసారి మంత్రివర్గ ఉపసంఘంతో కూర్చుని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకుంటాం. ఉద్యోగుల సమస్యలపై సరైన సమయంలో స్పందించినందుకు సీఎంకు, మంత్రివర్గ ఉపసంఘానికి, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు.’
- ఎ.విద్యాసాగర్, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీఎన్‌జీవో అసోసియేషన్, చైర్మన్, ఏపీ జేఏసీ