Young Singer Sadhya: గాయని సాధ్యకు సీఎం ప్రశంస
ABN , Publish Date - Dec 11 , 2025 | 03:39 AM
అంతర్జాతీయ వేదికలపై చిన్నతనంలోనే శ్రావ్యంగా పాటలు పా డుతూ పేరు తెచ్చుకున్న గాయని సాధ్యను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. గుంటూరు...
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ వేదికలపై చిన్నతనంలోనే శ్రావ్యంగా పాటలు పా డుతూ పేరు తెచ్చుకున్న గాయని సాధ్యను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. గుంటూరు జిల్లా కొండపాటూరుకు చెందిన సాధ్య తల్లిదండ్రులు స్వైరా, సిరికృష్ణ తో కలసి బుధవారం సీఎంను కలిశారు. యార్క్, హార్వర్డ్ యూనివర్సిటీ, శాన్‌ఫ్రాన్సిస్ స్కో ఓపెరా హౌస్ వంటి పలు అంతర్జాతీయ వేదికలపై పాడిన సాధ్య 7 సార్లు ప్రథమ స్థానంలో నిలిచిందని ఆమె తల్లిదండ్రులు సీఎంకి వివరించారు. సాధ్య మరిన్ని విజయాలను సాధించాలని సీఎం ఆకాంక్షించారు.