Passing of Gopichand P Hinduja: గోపీచంద్.. విజన్ ఉన్న పారిశ్రామికవేత్త
ABN , Publish Date - Nov 05 , 2025 | 04:50 AM
హిందుజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్.పి.హిందుజా మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో స్పందించారు...
హిందుజా గ్రూప్ చైౖర్మన్ మృతికి సీఎం సంతాపం
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): హిందుజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్.పి.హిందుజా మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘ఆయన విజన్ ఉన్న పారిశ్రామికవేత్త. హిందుజా గ్రూప్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి గోపీచంద్. గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి. 1984లో గల్ఫ్ ఆయిల్‌ను కౌవశం చేసుకోవడం మొదలుకొని అశోక్ లేలాండ్‌ను పునరుద్ధరించడం వరకు ఆయన సేవలు చిరస్మరణీయం. విద్యుత్తు, మౌలిక వసతుల కల్పనలోకి గ్రూప్‌ను తీసుకురావడంలో గోపీచంద్ కృషి గొప్పది. ఆయన స్ఫూర్తి తదుపరి తరాలకు కూడా మార్గదర్శకం కావాలి’ అని సీఎం ఆకాంక్షించారు. మంత్రి లోకేశ్ కూడా గోపీచంద్.పి.హిందుజా మృతికి సంతాపం తెలిపారు.