Viral Post: వైజాగ్ పేరులో గూగుల్ చంద్రబాబు పోస్టు వైరల్
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:42 AM
విశాఖలో గూగుల్ పెట్టుబడులపై ఆకట్టుకునేలా, ఆసక్తికరంగా సీఎం చంద్రబాబు ఎక్స్‌లో స్పందించారు.
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): విశాఖలో గూగుల్ పెట్టుబడులపై ఆకట్టుకునేలా, ఆసక్తికరంగా సీఎం చంద్రబాబు ఎక్స్‌లో స్పందించారు. వైజాగ్ పేరులో గూగుల్ లోగో ప్రతిబింబించేలా డిజైన్ చేసిన పోస్టర్‌ను ఆయన పోస్ట్ చేశారు. ఇంగ్లీషు అక్షరాలు వైజాగ్‌లో ‘జీ’ స్థానంలో గూగుల్ లోగోను చేర్చి సముద్ర తీరాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంచి పోస్టర్ విడుదల చేశారు. 15 బిలియన్ డాలర్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాకతో దేశం చూపు వైజాగ్ వైపు పడింది. దీనిని ప్రతిబింబించేలా వైజాగ్‌కు గూగుల్ అంటూ... వైజాగ్ పేరును, గూగుల్ లోగోను కలిపి సీఎం చేసిన పోస్టు వైరల్ అయింది.