Share News

CM Chandrababu Visit Kadapa: నేడు కడప జిల్లాకు సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 19 , 2025 | 06:00 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. కమలాపురం నియోజకవ ర్గం పెండ్లిమర్రిలో పీఎం కిసాన్‌ అన్నదాత...

CM Chandrababu Visit Kadapa: నేడు కడప జిల్లాకు సీఎం చంద్రబాబు

  • పెండ్లిమర్రిలో అన్నదాత సుఖీభవ.. రైతులతో ముఖాముఖి

కడప, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. కమలాపురం నియోజకవ ర్గం పెండ్లిమర్రిలో ‘పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ’ కార్యక్రమంలో పాల్గొంటారు. షె డ్యూల్‌ ప్రకారం.. ఉదయం సత్యసాయి జిల్లా పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు ప్రత్యే క విమానంలో కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టరులో 1.15 గంటలకు పెండ్లిమర్రి జడ్పీ హైస్కూలుకు చేరుకుంటారు. 1.25 వరకు ప్రజాప్రతినిఽధులతో మాట్లాడతారు. అనంతరం పెండ్లిమర్రిలోని వెల్లటూరులోగల మన గ్రోమోర్‌ సెంట రు ఎరువుల దుఖాణాన్ని పరిశీలించి, రైతుల తో ముఖాముఖి మాట్లాడతారు. 1.45కు రోడ్డుమార్గాన పెండ్లిమర్రిలోని ప్రజావేదిక చేరుకుంటారు. పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రధాని మోదీ ప్రసంగా న్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులతో కలిసి తిలకిస్తారు. 4.15కు బయల్దేరి చిన్నదాసరిపల్లెకు చేరుకుని వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 5.15 నుంచి 6.15 వరకు వెల్లటూరులో టీడీపీ కార్యకర్తలతో భేటీ అవుతారు.

Updated Date - Nov 19 , 2025 | 06:00 AM