CM Chandrababu: తప్పులు జరగనివ్వొద్దు
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:22 AM
రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నామని సీఎం అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని శక్తికి మించి అమలు చేస్తున్నామని.. కానీ కొందరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల చేసిన శ్రమంతా...
జరిగితే సరిదిద్దుకోండి.. లేదంటే నష్టపోతాం
జనం కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నాం
శక్తికి మించి అభివృద్ధి, సంక్షేమం అమలు
అయినా కొందరు చేసే చిన్న చిన్న తప్పులతో శ్రమంతా వృథా అవుతోంది
ఇది మంచి పరిణామం కాదు
మంత్రివర్గ సహచరులకు సీఎం హితవు
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నామని సీఎం అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని శక్తికి మించి అమలు చేస్తున్నామని.. కానీ కొందరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల చేసిన శ్రమంతా వృథా అయిపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. మన ప్రభుత్వానికి ఉన్న గుడ్‌విల్ తగ్గి మళ్లీ జీరోకి వస్తున్నామన్నారు. ఇది మంచి పరిణామం కాదని చెప్పారు. తప్పులు దిద్దుకోకపోతే నష్టపోతామని హెచ్చరించారు. ‘మంత్రులైనా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు.. ఎవరైనా సరే తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించండి.. పొరపాట్లు జరిగితే వెంటనే సరిద్దుకోండి’ అని మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు 24 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశమయ్యానన్నారు. ‘వారు చేసిన పొరపాట్లను చెప్పినప్పుడు అంగీకరించి సరిదిద్దుకుంటామని చెప్పారు. బీజేపీ, జనసేన పెద్దలు కూడా వారి వారి ఎమ్మెల్యేలతో ఇలాంటి ముఖాముఖి మొదలుపెడితే బాగుంటుంది’ అని సూచించారు. అంతర్జాతీయ పరిణామాలు రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను సీఎం క్యాబినెట్ ముందు ఉంచారు. ఉదాహరణకు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా అక్కడ ఉన్న తెలుగువారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఇక్కడి నుంచి అమెరికా వెళ్లే వారికి ఎలాంటి సూచనలు చేయాలో మంత్రుల కమిటీ వివరించేలా ఉండాలని చెప్పారు.