Share News

Public Interaction: నేడు విజయనగరం జిల్లాకు ముఖ్యమంత్రి

ABN , Publish Date - Oct 01 , 2025 | 05:08 AM

ముఖ్యమంత్రి చంద్రబాబుబుధవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. దత్తిరాజేరు మండలం...

 Public Interaction: నేడు విజయనగరం జిల్లాకు ముఖ్యమంత్రి

  • దత్తిలో పింఛన్ల పంపిణీ

విజయనగరం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుబుధవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో పేదలకు స్వయంగా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు అందజేయనున్నారు. అనంతరం పేదలతో ముఖాముఖి, టీడీపీ శ్రేణులతో సమావేశం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసరావు మంగళవారం గ్రామంలో పర్యటించారు. కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌, జేసీ ఎస్‌.సేతుమాధవన్‌, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లపై చర్చించారు.

Updated Date - Oct 01 , 2025 | 05:09 AM