Pension Distribution: రేపు పెద్దన్నవారిపల్లికి సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 31 , 2025 | 05:47 AM
శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం వస్తున్నారని అధికారులు తెలిపారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు
పుట్టపర్తి టౌన్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం వస్తున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీశ్ కుమార్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గురువారం పరిశీలించారు. జిల్లాలో నవంబరు నెలకు 2,64,802 మందికి రూ.115.92 కోట్ల పింఛన్ సొమ్ము మంజూరైంది. పెద్దన్నవారిపల్లిలో జరిగే పింఛన్‌ల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు. గ్రామంలో 756 మంది లబ్ధిదారులు ఉన్నారు.