Palakollu: 24న పాలకొల్లుకు సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 21 , 2025 | 05:09 AM
మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
పాలకొల్లు టౌన్, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 24వ తేదీ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రానున్నారు. స్థానిక బ్రాడీపేట బైపాస్ రోడ్డులోని కళ్యాణ వేదిక సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం పరిశీలించారు. హెలీప్యాడ్ వద్ద బందోబస్తు ఏర్పాట్లు, మ్యాప్‌ను పరిశీలించారు.