Share News

వచ్చే నెలలో 3 లక్షల ఇళ్లు ప్రారంభం: కొలుసు

ABN , Publish Date - Aug 27 , 2025 | 06:35 AM

రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చాక నిర్మించిన 3 లక్షల ఇళ్లకు ప్రారంభోత్సవం.. మరో 50 వేల ఇళ్లకు శంకుస్థాపనల్ని వచ్చే నెలలో సీఎం చంద్రబాబు చేస్తారని గృహ నిర్మాణ శాఖ....

వచ్చే నెలలో 3 లక్షల ఇళ్లు ప్రారంభం: కొలుసు

  • మరో 50 వేల ఇళ్లకు శంకుస్థాపనలు: మంత్రి పార్థసారథి

రాజమహేంద్రవరం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చాక నిర్మించిన 3 లక్షల ఇళ్లకు ప్రారంభోత్సవం.. మరో 50 వేల ఇళ్లకు శంకుస్థాపనల్ని వచ్చే నెలలో సీఎం చంద్రబాబు చేస్తారని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సర్వే జరుగుతోందని, ఎవరికి ఇల్లు అవసరమో ఈ సర్వేలో గుర్తిస్తామన్నారు. రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టిన మాజీ సీఎం జగన్‌ ఇప్పటికీ ప్రజలు, రాష్ట్రం గురించి ఆలోచించడం లేదన్నారు.

‘అందరికీ ఇళ్లు’ అమలుకు మంత్రుల కమిటీ

‘అందరికీ ఇళ్లు’ కార్యక్రమం అమలును పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రు ల బృందాన్ని ఏర్పాటు చేసింది. గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ బృందంలో సభ్యులుగా నియమించింది.

Updated Date - Aug 27 , 2025 | 06:36 AM