Mega Parents-Teachers Meet: రేపు కొత్తచెరువుకు సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 09 , 2025 | 06:03 AM
శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువులో ఈ నెల 10న నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ మీట్ 2.0లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వస్తున్నారు.
శ్రీసత్యసాయి జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్
పుట్టపర్తి, జూలై 8(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువులో ఈ నెల 10న నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ మీట్ 2.0లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వస్తున్నారు. కొత్తచెరువులోని శ్రీసత్యసాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాగంణంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో మెగా పేరెంట్ టీచర్స్ మీట్ నిర్వహిస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న, ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి మంగళవారం పరిశీలించారు.