CM Chandrababu Serious: అనంత ఎమ్మెల్యేపై సీఎం సీరియస్
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:27 AM
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు..
పల్లాను కలసి వివరణ ఇవ్వాలని ఆదేశం
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం సీఎంను కలిసేందుకు వెంకటేశ్వర ప్రసాద్ సచివాలయానికి వచ్చారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పట్ల తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించగా... ‘మీ వ్యాఖ్యలు, తీరు ఏమాత్రం సరికాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాను కలసి వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేను ఆదేశించారు. మంగళవారం అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి పల్లాను కలసి, నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను వివరించి వెళ్లారు. దీంతో బుధవారం వెంకటేశ్వర ప్రసాద్ హుటాహుటిన అమరావతి వచ్చి సీఎంను కలిసి, వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.