Share News

CM Chandrababu: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమ

ABN , Publish Date - Jul 22 , 2025 | 05:58 AM

ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు రాయలసీమకు విస్తారమైన అవకాశాలున్నాయి. కొప్పర్తి, శ్రీసిటీ, హిందూపురంతో...

CM Chandrababu: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమ

  • కొప్పర్తి, శ్రీసిటీ, హిందూపురం ఆ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం

  • మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్యాలు సాధించేలా ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్‌ పాలసీ-2025

  • ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0పై సమీక్షించిన సీఎం చంద్రబాబు

అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): ‘ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు రాయలసీమకు విస్తారమైన అవకాశాలున్నాయి. కొప్పర్తి, శ్రీసిటీ, హిందూపురంతో సహా సీమలోని పలుప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనువైన వాతావరణం ఉంది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఎలకా్ట్రనిక్స్‌ కాంపొనెంట్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ పాలసీ 4.0 2025-30పై పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్షించారు. గత ఏడాది దేశంలో 70 మిలియన్‌ డాలర్ల విలువైన ఎలకా్ట్రనిక్‌ సర్క్యూట్‌ బోర్డులు దిగుమతి అయ్యాయని అధికారులు వివరించారు. ఎలకా్ట్రనిక్స్‌ సర్క్యూట్‌లకు డిమాండ్‌ అత్యధికంగా ఉందని వారు సీఎంకు చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ, ‘2025-30 మధ్యకాలంలో ఎలకా్ట్రనిక్స్‌ తయారీ పరిశ్రమలు స్థాపించేలా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామిక దిగ్గజ సంస్థలతో సంప్రదింపులు జరపండి. ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగుమతులు తగ్గి స్థానికంగానే ఉత్పత్తికావడం వల్ల ఽధరలను నియంత్రించే వీలుంది. ఎలకా్ట్రనిక్స్‌ రంగంలో సెల్ఫ్‌ రిలయన్స్‌ - మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్యాలు నెరవేరాలి. రాష్ట్రంలో తయారైన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్‌కు బ్రాండ్‌ను సృష్టించాలి. ఇదే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. పరిశ్రమల ఏర్పాటుతో సహా ఉత్పత్తికి అనువైన ఎకో సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేయాలి. ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్‌ తయారీ రంగంలో 100 బిలియన్‌ డాటర్ల మేర పెట్టుబడులు రాబట్టాలి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్‌ రంగంలో ముందున్న బెంగళూరు, చెన్నయ్‌లలో ఎదుర్కొంటున్న భూమి సమస్యను మనకు అనుకూలంగా మలుచుకోవాలి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేలా ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీపాలసీని రూపొందించాలి’ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు విస్తృత అవకాశాలున్న విశాఖ, అమరావతి, తిరుపతి నగరాల్లో 500 ఐటీ కంపెనీలకు కేటాయించడం ద్వారా ఒకేసారి ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయని అన్నారు. విశాఖలో ఐటీ, ఐటీఈఎస్‌ సంస్థలతో పాటు లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకూ ఎలక్ట్ఞానిక్స్‌ పరికరాల తయారీ సంస్థలను ఏర్పాటు చేసే వీలుందని చంద్రబాబు చెప్పారు. ఈ ప్రాంతాల్లో కోవర్కింగ్‌ స్పేస్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. విజయవాడతో పాటు రాష్ట్రంలోని మిగిలిన నగరాల్లోనూ ఉద్యోగావకాశాలు పెరిగేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.


2030 నాటికి గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా ఆంధ్ర

2030 నాటికి రాష్ట్రం గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా రూపుదిద్దుకునేలా అడుగులు వేయాలని ఇంధన శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీ డిక్లరేషన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌తో కలసి విడుదల చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఈడీఏపీ ఎండీ కమలాకరబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా తీర్దిదిద్దడానికి అవసరమైన కార్యాచరణతో కూడిన డిక్లరేషన్‌ను చంద్రబాబు విడుదల చేశారు. ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు జరిగిన గ్రీన్‌ హైడ్రోజన్‌ సమ్మిట్‌లో 600 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్లను స్థాపించేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తిని పెంచేలా దేశంలోనే అతి పెద్ద ఎకోసిస్టమ్‌ను అమలు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. 2027 నాటికి రెండు గిగావాట్లు, 2029 నాటికి ఐదు గిగావాట్ల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవాలని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. కిలో హైడ్రోజన్‌ గ్యాస్‌ ఉత్పత్తి ధరను రూ.460 నుంచి రూ.160 కి తగ్గించేలా పరిశోధనలు, కార్యాచరణను అమలు చేయాలని సూచించారు. గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ను రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ తీర్చిదిద్దాలని డిక్లరేషన్‌లో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పరిశోధనల కోసం రూ.500 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించారు. ఆవిష్కరణలను ప్రోత్సహించేలా 50 స్టార్ట్‌పలకు ప్రోత్సాహన్ని కల్పించాలని తీర్మానించారు.

Updated Date - Jul 22 , 2025 | 05:59 AM