Telugu Leader: టంగుటూరికి సీఎం నివాళి
ABN , Publish Date - Aug 24 , 2025 | 06:31 AM
తెలుగువారిలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన ధీరోదాత్తుడు, త్యాగధనుడు, తెలుగు జాతి సాహసానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు...
అమరావతి ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): తెలుగువారిలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన ధీరోదాత్తుడు, త్యాగధనుడు, తెలుగు జాతి సాహసానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రకాశం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి బాటలు పరిచిన ప్రకాశాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సీఎం పేర్కొన్నారు.