Share News

Political Legacy: హరికృష్ణకు సీఎం చంద్రబాబు నివాళి

ABN , Publish Date - Sep 03 , 2025 | 06:30 AM

చైతన్య రథసారథి, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు నివాళులర్పించారు. ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న హరికృష్ణ..

Political Legacy: హరికృష్ణకు సీఎం చంద్రబాబు నివాళి

అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): చైతన్య రథసారథి, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు నివాళులర్పించారు. ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న హరికృష్ణ తరతరాలకు గుర్తిండిపోయే నాయకుడు అని చంద్రబాబు కొనియాడారు. మంత్రి లోకేశ్‌ కూడా హరికృష్ణకు నివాళులర్పించారు. ‘హరి మావయ్య మన మధ్య లేకపోయినా వారి జ్ఞాపకాలు మా మనస్సుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. సినీ రంగానికి, పార్టీకి, ప్రజలకు నందమూరి హరికృష్ణ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం’ అని లోకేశ్‌ అన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 06:31 AM