Share News

మహిళా అభ్యున్నతే సీఎం చంద్రబాబు ధ్యేయం

ABN , Publish Date - Aug 30 , 2025 | 11:58 PM

రాష్ట్రాభివృద్ధి, బడుగు, బలహీన వర్గాలతోపాటు మహిళా అభ్యున్నతే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, టీడీపీ ఇన్‌ఛార్జి భూపేశ్‌రెడ్డి పేర్కొన్నారు.

మహిళా అభ్యున్నతే సీఎం చంద్రబాబు ధ్యేయం
స్త్రీశక్తి సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి

జమ్మలమడుగు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధి, బడుగు, బలహీన వర్గాలతోపాటు మహిళా అభ్యున్నతే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, టీడీపీ ఇన్‌ఛార్జి భూపేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్త్రీశక్తి సూపర్‌హిట్‌ సమావేశంలో భూపేశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికోసం, మహిళల కోసం ఇచ్చిన మాట సీఎం నిలబెట్టుకున్నారన్నారు.సూపర్‌-6 పథకాలు సూపర్‌ హిట్‌ అయ్యాయన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధిలేక ప్రజలు ఆ పార్టీకి తిరుగుబాటు చేసి కూటమిని ఎంచుకున్నారన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో సోలార్‌ ప్రాజెక్టు, గండికోట టూరిజం, స్టీల్‌ప్లాంటు తదితరవన్నీ అభివృద్ధిలో భాగమేనన్నారు. అనంతరం మండలస్థాయిలోని మహిళా నాయకులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి టీడీపీ ఇన్‌ఛార్జి భూపేశ్‌రెడ్డి,ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయిలోని కూటమి నాయకులు, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ సింగంరెడ్డి నాగేశ్వరరెడ్డి, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 11:58 PM