Share News

CM Chandrababu: ఎన్నారైలకూ బీమా

ABN , Publish Date - Oct 26 , 2025 | 05:11 AM

ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ధి, భద్రతలో భాగంగా రాష్ట్రప్రభుత్వం ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని అందిస్తోంది.

CM Chandrababu: ఎన్నారైలకూ బీమా

  • దుబాయ్‌లో కొత్త పథకానికి సీఎం శ్రీకారం

విజయవాడ కలెక్టరేట్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ధి, భద్రతలో భాగంగా రాష్ట్రప్రభుత్వం ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు శుక్రవారం దుబాయ్‌లో ప్రారంభించారు. విదేశాల్లో పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు, విద్యార్థులు దీనితో లబ్ధిపొందవచ్చు. ఈ బీమా పరిధిలోని వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. దీనిని రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సీఎం ఆకాంక్షిస్తున్నారు.

Updated Date - Oct 26 , 2025 | 05:12 AM